రవీంద్ర భారతి తెలంగాణ రాష్ట్ర ఒగ్గుబీర్ల కళాకారుల సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం
తెలంగాణ రాష్ట్ర ఒగ్గుబీర్ల కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఒగ్గు పూజారుల సాధక బాధకాలు, కష్టసుఖాలు స్వయంగా తెలుసుకునేందుకు “సంక్షేమయాత్ర”ను అతి త్వరలో చేపట్టేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. గ్రామ గ్రామాన ఉన్నటువంటి అర్హులైన వృద్ధ కళాకారులకు ప్రభుత్వం నుండి వీలైనంత త్వరగా పెన్షన్లు ఇప్పించే కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒగ్గుబీర్ల పూజారుల గణన పూర్తిచేసి మన సంఖ్యాబలాన్ని కూడా ప్రభుత్వానికి చూపించాల్సిన అవసరం ఆవశ్యకత ఉందని గుర్తించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంఘానికి మరి కొంతమంది పెద్దల సేవలు అవసరం ఉన్నదని గుర్తించి సాయిల్ల మల్లేశం ని రాష్ట్ర సంఘం గౌరవ సలహాదారునిగా నియమించడం జరిగింది. యువ ఒగ్గు కథకులు శ్రీ గాజర్ల దేవరాజు ఒగ్గు , శ్రీ బొప్పనపల్లి రాజేష్ ఒగ్గు , శ్రీ కొలుపుల మహేష్ ఒగ్గు , రాష్ట్ర కార్యదర్శులుగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా
రాష్ట్ర అధ్యక్షులు చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేయడం జరిగింది. ఈ సమావేశం అనంతరం రాష్ట్ర భాషాసాంస్కృతిక శాఖ సంచాలకులు డా. మామిడి హరికృష్ణ కలిసి ఒగ్గు పూజారుల గోడును వినిపించారు. ఈ సందర్భంగా వారు కళాహృదయంతో స్పందించి వీలైనంత త్వరగా ఒగ్గు పూజారులకు తీపి కబురు అందిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఒగ్గుబీర్ల పూజారుల సంక్షేమార్ధం నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఒగ్గుబీర్ల కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు పెద్దలు ఒగ్గు ధర్మయ్య , ప్రధాన కార్యదర్శి డా. ఉస్తాద్ ఒగ్గురవి , రాష్ట్రకోశాధికారి గాజర్ల బుగ్గయ్య ఒగ్గు, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు శ్రీ కుంట సదయ్య ఒగ్గు , రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఒగ్గు మధు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి శ్రీ ఒగ్గు మహిపాల్ , యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షకార్యదర్శులు శ్రీ బండి రమేష్ ఒగ్గు, ఇక్కిరి మధు ఒగ్గు, వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ సందం బీరప్ప ఒగ్గు , మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు శ్రీ ఆడికి శివ ఒగ్గు ,జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీ కొల్లూరు శివరాజు ఒగ్గు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీ ఏగుర్ల శ్రీను ఒగ్గు వివిధ జిల్లాల నుండి విచ్చేసిన ఒగ్గు బీర్ల పూజారులు పాల్గొన్నారు
Leave a Reply